AC రేటు రూ.45 వేలు.. ఇన్స్టాలేషన్ బిల్లు రూ.20 వేలు! వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్ట్

AC రేటు రూ.45 వేలు.. ఇన్స్టాలేషన్ బిల్లు రూ.20 వేలు! వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్ట్

సమ్మర్ వచ్చేసింది. పిల్లలకు కూడా స్కూల్స్ కి సెలవులు వచ్చాయి. మండిపోతున్న ఎండల్లో ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్న ఫ్యామిలీస్ కూలర్ల నుంచి ఏసీలకు మారుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఏసీ ఏ మోడల్ కొనాలి, ఎంత కెపాసిటీది తీసుకోవాలి, ఎక్కడ ఫిట్ చేయించాలి, ఎలా వాడితే కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది అంటూ తెగ రీసెర్చ్ చేసేస్తున్నారు. కానీ ఏసీ కొన్నాక దాన్ని ఇన్స్టాలేషన్ చేయించటం లేదా మెయింటెనెన్స్ రిపేర్ల గురించి కూడా కొద్దిగా తెలుసుకుంటే పూర్తి క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఒక ప్రముఖ కంపెనీ ఏసీ ఇన్స్టాలేషన్ కి సంబంధించిన బిల్లును ఒక యూజర్ రెడ్డిట్ లో షేర్ చేయటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అసలు ఏం జరిగింతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ అనగానే ముందుగా అందరూ చూసేది రెండు ఒకటి బడ్జెట్ రెండు ఫీచర్స్. వేలకు వేలు పెట్టి కొన్నాక దాన్ని ఇంట్లో ఇన్స్టాలేషన్ కోసం మరో రూ.3వేల నుంచి రూ.3వేల 500 వరకూ ఖర్చు అవుతుందని తెలుసు. కానీ ఒక రెడిట్ యూజర్ తనకు ఎదురైన పరిస్థితిని బిల్లుతో సహా షేర్ చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

తాను రూ.45వేలు పెట్టి డైకిన్ బ్లాండ్ ఏసీ ఒకటి కొన్నట్లు చెప్పారు. అయితే తన బిల్డింగ్ స్టక్చర్ కారణంగా ఏసీ ఫిట్టింగ్ కోసం ఇండోర్ యూనిట్, ఔట్ డోర్ యూనిట్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని చెప్పాడు. సో దీనివల్ల కంపెనీ ఇచ్చిన పైప్, పవర్ కేబుల్స్ సరిపోక అదనంగా కొనాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అవన్నీ కలిపితే జస్ట్ ఇన్టాలేషన్ కోసమే రూ.19వేల 915 ఖర్చవుతోందని చెప్పాడు. ఏసీ కొన్నాననే ఆనందం తనకు లేదని ఏసీ రేటులో దాదాపు సగం ఫిట్టింగ్ కోసం ఖర్చు రావటంతో ఏం చేయాలో తెలియటం లేదంటూ తన రెడ్డిట్ పోస్టులో చెప్పాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

దీనిపై నెటిజన్లు సలహాలు సూచనలు చేస్తూ అవసరమైన కాపర్ పైప్, పీవీసీ పైప్, ఎలక్ట్రికల్ కేబుల్స్ బయట తెచ్చుకుంటే కంపెనీ సర్వీస్ వాళ్లు వచ్చి ఏసీ ఫిట్ చేస్తారు ఇలా చేయటం వల్ల కొంత డబ్బు సేవ్ చేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల వల్ల రూ.6 వేల నుంచి రూ.9వేల వరకూ సేవ్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. సో మెుత్తానికి కాపర్ రేటు ఎక్కువగా ఉండటం వల్ల ఖర్చు ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఏసీ అమ్మిన కంపెనీ తప్పేమీ లేనప్పటికీ ఇన్స్టాలేషన్ సైట్ లో ఉన్న ఇబ్బందులు ఖర్చు పెంచుతున్నాయని తేలింది.