కరోనా కొత్త వేరియంట్ పై సర్కార్ అలర్ట్

కరోనా కొత్త వేరియంట్ పై సర్కార్ అలర్ట్

కరోనా కొత్త వేరియంట్ పై అలర్ట్ అయింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త వేరియంట్  వ్యాపిస్తున్న దేశాల నుంచి వేచ్చేవారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై.. రాష్ట్రఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో సమావేశమై చర్చిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్ కు ఫ్లైట్స్ లేకపోవడంతో ముంబై, ఢిల్లీలో దిగి హైదరాబాద్ వచ్చేవారి ట్రెసింగ్, టెస్టింగ్ కి సంబంధించిన అంశాలపై డిస్కషన్ జరుగుతోంది. కొత్త వేరియంట్లు, థర్డ్ వేవ్ వస్తే ఏర్పాట్లు సహా హెల్త్ ఫెసిలిటీస్ పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.