ఈఎన్సీ మురళీధర్ రాజీనామాకు ఆమోదం

ఈఎన్సీ మురళీధర్ రాజీనామాకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు : ఇరిగేషన్​ఈఎన్సీ (జనరల్) మురళీధర్​రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగుబాటుతో పాటు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ఆయన తీరుతో అసంతృప్తితో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

ఆ రాజీనామాకు ఆమోదం తెలుపుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మురళీధర్​2013లోనే ఈఎన్సీగా రిటైర్​అయ్యారు. అప్పటి నుంచి ఎక్స్​టెన్షన్​లో ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఈఎన్సీ నియామకం కోసం ప్రతిపాదనలు పంపాలని కోరుతూ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్​కుమార్ ను ఆదేశించారు. కొత్త ఈఎన్సీని నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.