ప్రభుత్వ శాఖలు నీటి బకాయిలు చెల్లిస్తలేవు

ప్రభుత్వ శాఖలు నీటి బకాయిలు చెల్లిస్తలేవు
  • సీఎస్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లెటర్

హైదరాబాద్, వెలుగు: వాటర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు భారీగా నీటి బకాయిలు ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రూ.1,283 కోట్లు(మిషన్ భగీరథ - రూ.601 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ - రూ.594 కోట్లు, హెల్త్ డిపార్ట్ మెంట్ - రూ.42 కోట్లు, హౌసింగ్ డిపార్ట్ మెంట్ - రూ.22 కోట్లు, పోలీస్ డిపార్ట్ మెంట్ - రూ.15 కోట్లు, జీఏడీ - రూ.9 కోట్లు), కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి రూ.252 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. ఆయా శాఖలకు వాటర్ బోర్డు నోటీసులు పంపినా చెల్లించటం లేదని, చర్యలు తీసుకోవాలని సీఎస్​కు  లేఖ రాశారు.