
సంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయాన్ని దర్శించుకున్న హరీష్ రావు… ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాలకు కేటాయించిన నిధులను నేతలు దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో దేవాలయాలకు కేటాయించిన నిధులను దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు.