రూ.2,945 కోట్లతో నారాయణపేట్​–కొడంగల్​ లిఫ్ట్

రూ.2,945 కోట్లతో నారాయణపేట్​–కొడంగల్​ లిఫ్ట్
  • రూ.2,945 కోట్లతో నారాయణపేట్​–కొడంగల్​ లిఫ్ట్
  • ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: నారాయణపేట్​– కొడంగల్ ​లిఫ్ట్ ​స్కీంకు రూ.2,945.50 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. నారాయణపేట్​, కొడంగల్, మక్తల్​నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, డిటైల్డ్​ఇన్వెస్టిగేషన్, ల్యాండ్​అక్విజేషన్​ కోసం 2014లో ఇచ్చిన జీవో 69కి కొనసాగింపుగా గురువారం  కొత్త ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో జూరాలపై చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం ఆధారంగా నారాయణపేట్​– కొడంగల్​ లిఫ్ట్​ స్కీం పనులు చేపట్టనున్నారు. తెలం గాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ​ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​గెలిస్తే నారాయణపేట్​– కొడంగల్​ లిఫ్ట్​ స్కీమ్​ పనులు చేపడుతున్నామని రేవంత్​ హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అధికారులను ఆదేశించారు.