స్కూల్ యూనిఫాంల తయారీ మహిళా సంఘాలకు

స్కూల్ యూనిఫాంల తయారీ మహిళా సంఘాలకు

హైదరాబాద్, వెలుగు: స్కూల్ యూనిఫాంల స్టిచింగ్  బాధ్యతలను  మహిళ స్వయం సహాయక బృందాలకు అప్పగిస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్స్, గురుకుల విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంలను మహిళ సంఘాల సభ్యులు కుట్టనున్నారు.  

రాష్ర్టంలో 63,44,985 జతల స్కూల్ యూనిఫాంలు అవసరమున్నట్లు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అంచనా వేసిందని, ఇందుకు 28 వేల 200 మంది టైలర్ లు అవసరమని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్లాత్ ఇచ్చిన 45 రోజుల్లోగా యూనిఫామ్ కుట్టాలని, ఇందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.