జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: టీఎస్‌‌‌‌జేయూ

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: టీఎస్‌‌‌‌జేయూ

పద్మారావునగర్​,వెలుగు :  జర్నలిస్టుల చిరకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్‌‌‌‌జేయూ ధన్యవాదాలు తెలిపింది. గత ప్రభుత్వం 23 వేల మందికే అక్రిడిటేషన్లు పరిమితం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం జీవో 252 ద్వారా ఏకంగా 46 వేల మందికి గుర్తింపు కార్డులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేసింది. జూన్ 2 నాటికి ఇండ్ల స్థలాల కలను సాకారం చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనపై రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలన్న నిర్ణయం అభినందనీయమన్నారు.