సర్కారు జాగ కాజేసేందుకు మాస్టర్ ప్లాన్... ఖాళీ స్థలంలో ఇల్లు కట్టినట్టు ఇంటి నంబర్ల సృష్టి  

సర్కారు జాగ కాజేసేందుకు మాస్టర్ ప్లాన్... ఖాళీ స్థలంలో ఇల్లు కట్టినట్టు ఇంటి నంబర్ల సృష్టి  
  • ఫొటోలు క్రియేట్​ చేసి నకిలీ సేల్​డీడ్​తో కబ్జాకు యత్నం ఏడుగురు అరెస్ట్​

చందానగర్​, వెలుగు : ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టినట్టు ఇంటి నెంబర్లు, ఫొటోలు క్రియేట్​చేసి పీటీఎన్​నెంబర్లు వేసి, నకిలీ సేల్​డిడ్​తో కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురిని చందానగర్​పోలీసులు అరెస్ట్​చేశారు. చందానగర్​లోని సర్వే నెంబర్లు 373,374,375లలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 498 గజాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని దక్కించుకోవడానికి కొందరు ప్లాన్​వేశారు. 

ఇంటి నెంబర్లు, నకిలీ పీటీఎన్​నెంబర్లు, రిజిస్టర్​సేల్​డీడ్స్​సృష్టించారు. దీన్ని గుర్తించిన సదరు శాఖ అధికారి చందానగర్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరుటి నిరంజన్​, వేణుకుమార్​, క్రాంతికుమార్​, రాజురవి సెల్వరాజ్​, సయ్యద్​ యూసుఫ్, మహమ్మద్​ అజహర్​అలీ, మధవ్​ సుమన్​ను బుధవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.