నిజామా బాద్, నిర్మల్ జిల్లాలకు పామాయిల్ ఫ్యాక్టరీ : ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి

నిజామా బాద్, నిర్మల్ జిల్లాలకు పామాయిల్ ఫ్యాక్టరీ :  ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి
  • ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి 

నవీపేట్, వెలుగు: నిజామాబాద్, నిర్మల్ జిల్లాల రైతుల కోసం పామాయిల్​ ఫ్యాక్టరీని ప్రభుత్వం కేటాయించిందని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం నిజామాబాద్​ జిల్లా నవీపేట్  పాలటెక్నిక్  కాలేజీని కలెక్టర్  ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పామాయిల్​ ఫ్యాక్టరీని మంజూరు చేసిందని, అనువైన స్థలం కోసం పరిశీలిస్తున్నామని చెప్పారు. 

పాలిటెక్నిక్  కాలేజీలో విద్యార్థులు చేరడం లేదని, స్టూడెంట్స్​ చేరేలా లెక్చరర్లు చొరవ చూపాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రోబోటిక్స్, కంప్యూటర్  సైన్స్  కోర్సులు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్  తాహెర్  బిన్  హందన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్  సభ్యుడు గడుగు గంగాధర్, సహకార యూనియన్  లిమిటెడ్  చైర్మన్  మోహన్ రెడ్డి, ఆర్డీవో రాజేందర్ కుమార్, పాలిటెక్నిక్  కాలేజీ ప్రిన్సిపాల్  గంగాధర్, సందీప్  ఉన్నారు. 

అభివృద్దికి సహకరిస్తా..

ఆర్మూర్: ఆర్మూర్​ పట్టణ అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరి సుదర్శన్​ రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్మూర్​ మున్సిపాలిటీకి వచ్చిన ఆయన మున్సిపల్  చైర్​పర్సన్​ గోనెలహరి, వైస్  చైర్​పర్సన్  కాటిపల్లి వెంకట్​రెడ్డి, కమిషనర్​ ఉమామహేశ్వర్​తో కలిసి రివ్యూ చేశారు. పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు.