ల్యాండ్ రికార్డ్స్ మార్చిన ఉద్యోగి సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

ల్యాండ్ రికార్డ్స్ మార్చిన ఉద్యోగి సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, వెలుగు: ల్యాండ్​ రికార్డ్స్ మార్చిన నిజామాబాద్ ​నార్త్​తహసీల్దార్​ఆఫీస్ ​రికార్డ్​ అసిస్టెంట్ జె.రాహుల్ సస్పెండ్​అయ్యారు. ఆఫీస్​లో ల్యాండ్ ​రికార్డులు మారుస్తున్నాడన్న ఆరోపణలపై విచారణ నిర్వహించిన కలెక్టర్​ ఇలా త్రిపాఠి.. అందిన రిపోర్టు మేరకు శనివారం చర్యలు తీసుకున్నారు.

నగరంలోని కంఠేశ్వర్​ఏరియాలోని సర్వే నంబర్​291/ఏ, 291 ఏఏ/ 292కు సంబంధించి పట్టాదారు​కాలంలో రాహుల్​బోగస్​ పేరు చేర్చి పహాణీ రూపొందించాడు. రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు.