విజయ్‎కు రెండు ఆప్షన్స్ ఇచ్చిన గవర్నర్: సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది సస్పెన్స్

విజయ్‎కు రెండు ఆప్షన్స్ ఇచ్చిన గవర్నర్: సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది సస్పెన్స్

24 గంటలుగా సాగుతున్న తమిళనాడు హై డ్రామా.. ఇప్పుడు విజయ్ కోర్టులోకే వచ్చింది. ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం అనుకున్న టైంలో రద్దు అయ్యింది. ఇది ఓ పెద్ద షాక్. ఆ తర్వాత డీఎంకే.. అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం అంతా వార్తలు.. ఈ హైడ్రామా మధ్య గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పిలుపుతో.. ఆయన్ను కలిశారు విజయ్. ఇద్దరి మధ్య 40 నిమిషాలు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. 

గవర్నర్ తో 40 నిమిషాల చర్చల తర్వాత.. నేరుగా ఇంటికి వచ్చారు విజయ్. గవర్నర్ తో మీటింగ్ విషయాలను పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. 
రెండే రెండు ఆప్షన్స్ ముందు ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు విజయ్.
ఆప్షన్ ఒకటి : 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం. ఆ తర్వాత గవర్నర్ ఇచ్చిన సమయంలో అసెంబ్లీలో బలం నిరూపించుకోవటం. 
ఆప్షన్ 2 : ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని.. వారి మద్దతును గవర్నర్ కు సమర్పించి.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం. 

ఈ రెండు ఆప్షన్స్ లో ఏది బెస్ట్ అనే అంశంపై మీరే తేల్చుకోవాలి అంటూ గవర్నర్ తన నిర్ణయాన్ని విజయ్ కే వదిలేసినట్లు తమిళనాడులో చర్చ నడుస్తుంది. 

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. అసెంబ్లీలో బల నిరూపణలో విఫలం అయితే ఆ వెంటనే.. సీఎంగా విజయ్ రాజీనామా చేయాల్సి వస్తుంది. 
అలా కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే.. అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టెక్కవచ్చు. ఆ తర్వాత ఆరు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 
ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని.. మీరే నిర్ణయం తీసుకోండి.. ఛాయిస్ ఫర్ యువర్స్ అంటూ గవర్నర్ వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. 
కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు ఇప్పటి వరకు మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే.. తన ఎమ్మెల్యేలతోపాటు.. పార్టీ నుంచి అధికారికంగా లేఖ అందజేసింది. 
మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు వస్తాయనేది చూడాలి. 
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. ముందా తర్వాత అనేది ఇప్పుడు విజయ్ చేతుల్లోనే ఉందనే వార్తలు వస్తున్నాయి.