25న గణేశ్ నిమజ్జనం..ఏటా 11వ రోజునే.. ఈ సారి 12వ రోజు

25న గణేశ్ నిమజ్జనం..ఏటా 11వ రోజునే.. ఈ సారి 12వ రోజు

 

  • తేదీ మారుస్తూ ఉత్సవ సమితి నిర్ణయం
  • అదే రోజు ప్రభుత్వ సెలవు
  • ఇప్పటికే 2 లక్షలకిపైగా విగ్రహాల నిమజ్జనం పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​లో ఈనెల25న గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిమజ్జనం జరగనున్నది. ప్రతి ఏడాది 11వ రోజున నిమజ్జనం నిర్వహిస్తుండగా..ఈసారి మంచి రోజుకాకపోవడంతో 12వ రోజున నిమజ్జనం చేయాలని ఉత్సవ సమితి సభ్యులు నిర్ణయించారు. ప్రభుత్వం కూడా శుక్రవారం సెలవును ప్రకటించింది. ఈ ఏడాది అనంత చతుర్దశి తిథి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24 గురువారం రాత్రి 11:18 గంటలకు ప్రారంభమై.. 25 శుక్రవారం రాత్రి 11:06 గంటల వరకు కొనసాగనున్నది. దీంతో ఈనెల 25న గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహాల నిమజ్జనానికి అనుకూలంగా ఉండటంతో ఆ రోజునే ప్రధాన నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. నగరవ్యాప్తంగా ఇప్పటికే నిమజ్జన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నిమజ్జన మార్గాలు, చెరువులు, జలాశయాల వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో 47 ప్రాంతాలు, సీఎంసీలో 53, ఎంఎంసీలో 40 ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో హుస్సేన్ సాగర్ సహా16 చెరువులు, 30 బేబీ పాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నిమజ్జనం జరగనుంది. మూడుకార్పొరేషన్ల పరిధిలో ఇప్పటివరకు 2లక్షలకిపైగా విగ్రహాల నిమజ్జనం జరిగింది.