ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్

ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి:  గవర్నర్

విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర  గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ పోలీసులను ఆదేశించారు. 2023 అక్టోబర్ 13న రాత్రి హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్ గదిలో ప్రవల్లిక  ఆత్మహత్య చేసుకున్న  ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై గవర్నర్ స్పందిస్తూ ప్రవల్లిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవల్లిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ALSO READ: ప్రవల్లికది ఆత్మహత్య కాదు..రాష్ట్ర సర్కార్ చేసిన హత్య 

ప్రవల్లిక ఆత్మహత్యపై సమగ్ర నివేదిక పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్  ఆదేశించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న  నిరుద్యోగ యువత మనోధైర్యం కోల్పో్యి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మహత్యలతో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టవద్దని అన్నారు. ఉద్యోగం రానంత మాత్రాన విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్దతి కాదని, ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పారు.  ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, విద్యార్థులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని గవర్నర్ తెలిపారు.