V6 News

ఆధ్యాత్మిక వారసత్వ ప్రతీక హిమాచల్ : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా

ఆధ్యాత్మిక వారసత్వ ప్రతీక హిమాచల్ : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా
  •     గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్య
  •     లోక్‌‌భవన్‌‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: ప్రకృతి సౌందర్యానికి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి హిమాచల్ ప్రదేశ్ ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. బుధవారం లోక్‌‌భవన్‌‌లో ఏ  ఏక్ భారత్ - శ్రేష్ట భారత్ కార్యక్రమంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హిమాచల్ ప్రదేశ్ ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, “ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌‌గా పనిచేసిన తర్వాత నేను ఇటీవల తెలంగాణకు గవర్నర్‌‌గా బాధ్యతలు స్వీకరించాను. హిమాచల్ ప్రదేశ్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, శౌర్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందింది” అని పేర్కొన్నారు. హిమాచల్ వైవిధ్యభరితమైన జానపద సంస్కృతి, సాంప్రదాయ పండుగలు, జానపద నృత్యాలు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో గవర్నర్ సతీమణి  జానకి శుక్లా, గవర్నర్ స్పెషల్ సీఎస్దాన కిషోర్ , బ్రిగేడియర్ డెక్స్టర్ నీగెల్, కర్నల్ అలోక్ బడోని  పాల్గొన్నారు.