ఎక్కడున్నా మన సంస్కృతిని మరవద్దు: గవర్నర్ తమిళిసై

ఎక్కడున్నా మన సంస్కృతిని మరవద్దు: గవర్నర్ తమిళిసై
  • మిజోరం అవతరణ వేడుకల్లో  గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజలు ఏ రాష్ర్టంలో ఉన్నా సొంత రాష్ర్ట సంస్కృతి, సంప్రదాయాలను మరవకూడదని  గవర్నర్ తమిళిసై అన్నారు. మంగళవారం రాజ్ భవన్ లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ర్ట అవతరణ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. " అన్ని రాష్ర్టాల్లో ఇతర రాష్ర్టాల అవతరణ వేడుకలు జరపాలన్న ప్రధాని మోదీ నిర్ణయం అభినందనీయం. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదవుల వల్ల ప్రజలు వేరే రాష్ర్టాల్లో నివసిస్తున్నారు.

అలాంటివారందరిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే మంచి కార్యక్రమమే ఇది" అని  గవర్నర్ తెలిపారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు మాట్లాడుతూ..  ఈ కార్యక్రమంలో  గవర్నర్ తో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో బాగుంటాయని తెలిపారు. తమది మిజోరం అయిన హైదరాబాద్ లో సెటిల్ అయ్యామన్నారు. ఎక్కడ ఉన్న వారి కల్చర్ ను మర్చిపోకూడదన్నారు. ఏక్ భారత శ్రేష్ఠ భారత్ లో  భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో అన్ని రంగాల్లో వేగంగా డెవలప్మెంట్ అవుతుందని క్రిస్టినా పేర్కొన్నారు.  

ముంబై నుంచే గవర్నర్ ఖాతా హ్యాక్ 

గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్ విచారణ వేగంగా జరుగుతుంది. ముంబై నుంచి గవర్నర్ తమిళిసై   ఖాతా హ్యాక్ అయినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు.  ముంబైలోని బొటెక్ వైఫె నెట్ వర్క్ ను దుండగుడు వినియోగించాడని నిర్ధారించారు. సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియకపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.