బంగారం దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు

బంగారం దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు

న్యూఢిల్లీ: కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌ లోటు (సీఏడీ) తగ్గుముఖం పట్టడంతోపాటు  పెరుగుతున్న బంగారం దిగుమతులకు చెక్‌‌‌‌ పెట్టేందుకు ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. పోయిన నెల నుంచే ఈ కొత్త మార్పులు పరిగణనలోకి తీసుకుంటారు. సుంకం పెంపు ఎఫెక్ట్‌‌తో 24, 22, 18 క్యారెట్ల గోల్డ్‌‌ (10 గ్రాముల) రేట్లు సుమారు రూ.1,000 పెరిగాయి. గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 7.5 శాతం ఉండగా, ఇప్పుడు అది 12.5 శాతానికి చేరింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్  2.5 శాతం కలవడం వల్ల ఇది మొత్తం 15 శాతం అవుతుంది. బంగారం దిగుమతులు గత రెండు నెలల్లో అమాంతం పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం.