V6 News

చిరుధాన్యాలతో ఆరోగ్యం  : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 

చిరుధాన్యాలతో ఆరోగ్యం  : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 

భద్రాచలం, వెలుగు: చిరుధాన్యాలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో శనివారం ఆయన ఐటీడీఏ పీవో బి.రాహుల్​తో కలిసి పోషణ్ పోషణ పక్వాడ్, పోషణ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రతిరోజూ తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. 

ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ బేటీ పడావో బేటీ బచావో అనే సూత్రాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం చేసి బేటీ పడావో బేటీ బచావో కిట్లను పంపిణీ చేశారు. అంగన్​వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో స్వర్ణలతా లెనినా, తహసీల్దార్​ అశోక్​కుమార్, ఎంపీడీవో వివేక్, సీడీపీవో జ్యోతి, ఏఎంసీ చైర్మన్​ తెల్లం సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.