అమెరికాలో గ్రామీ అవార్డుల వేడుక

అమెరికాలో గ్రామీ అవార్డుల వేడుక

అమెరికా లాస్ ఏంజెల్స్ లోని స్టేపుల్స్‌ సెంటర్‌లో 61వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడకలో అమెరికా గాయని ఆలీషియా కీస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా స్టేజ్‌పైకి వచ్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశారు. ఆమెతో పాటు ప్రముఖ అంతర్జాతీయ పాప్‌ గాయకులు లేడీ గాగా, జెన్నిఫర్‌ లోపేజ్ కూడా స్టేజ్‌పై సందడి చేశారు. అమెరికాకు చెందిన  ది రికార్డింగ్‌ కంపెనీగ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది. తొలి గ్రామీ అవార్డు వేడుకను 1959 మే4న నిర్వహించారు. అప్పట్లో దీనిని గ్రామోఫోన్‌ అవార్డు అనే వారు. ఏటా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేడుకకు ముందు ఈ గ్రామీ వేడుక జరుగుతుంది. వినోదాత్మక రంగంలో తమ వాయిస్ తో, పాటలతో ప్రేక్షకులను అలరించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ వేడుకలో దిస్‌ ఈజ్‌ అమెరికా పాట సాంగ్‌‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా నిలిచింది. ప్రముఖ గాయకుడు డొనాల్డ్ మెక్‌ కిన్లే గ్లోవర్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. ఈ ఆల్బమ్‌ నాలుగు కేటగిరీల్లో అవార్డు గెలుచుకుంది.