ఉంటే గింటే పర్మినెంట్ చర్చలే ఉండాలి : తాత్కాలిక చర్చలకు హర్మూజ్ తెరిచేది లేదన్న ఇరాన్

ఉంటే గింటే పర్మినెంట్ చర్చలే ఉండాలి : తాత్కాలిక చర్చలకు హర్మూజ్ తెరిచేది లేదన్న ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా.. పదే పదే హెచ్చరించినా.. చర్చలు అంటూ ముందుకు వస్తున్నా.. ఇరాన్ మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గటం లేదు. పాకిస్తాన్ దేశం కేంద్రంగా జరుగుతున్న కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇరాన్ మెలిక పెట్టింది. 

ప్రతిపాదనలు ఇవీ : 

>>> 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ. 
>>> హర్మూజ్ జల సంధిని వెంటనే ఓపెన్ చేయాలి. 
>>> 15 నుంచి 20 రోజుల్లో శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవాలి.

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ లతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఈ ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు. 

ఈ ప్రతిపాదనలకు ఇరాన్ ఓకే అంటూనే.. ఓ మెలిక పెట్టింది. తాత్కాలిక కాల్పుల విరమణ అని కాకుండా.. శాశ్వత కాల్పుల విరమణ అంటేనే చర్చలు ముందుకు వెళతాయి.. అప్పుడే మిగతా డిమాండ్లపై అటూ ఇటూగా మాట్లాడుకోవచ్చు అని స్పష్టం చేసింది ఇరాన్. 

ఇదే సమయంలో తాత్కాలిక చర్చల సమయంలో హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేయం అని.. హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేసే ఉద్దేశం లేదని వెల్లడించింది. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం ఉంటేనే.. హర్మూజ్ జల సంధిని ఓపెన్ చేస్తామని వెల్లడించింది ఇరాన్. 

Also Read : అమెరికా సైన్యాన్ని వెంటాడి దాడులు చేస్తున్న ఇరాన్

శాశ్వత కాల్పుల విరమణకు అమెరికా సిద్ధంగా లేదనేది ఈ ప్రతిపాదనలతోనే స్పష్టం అవుతుంది అంటూ ఇరాన్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ తాత్కాలిక అంటే.. శాశ్వత పరిష్కారంపై అమెరికాకు ఆసక్తి ఉన్నట్లు కనిపించటం లేదని.. శాశ్వత కాల్పుల విరమరణకు ఓకే అంటేనే హర్మూజ్ జల సంధి ఓపెన్ అవుతుందని.. తాత్కాలిక చర్చల సమయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది ఇరాన్.

ఏప్రిల్ 6వ తేదీకి ట్రంప్ డెడ్ లైన్ విధించారు. ఆ లోపు చర్చలకు ఓకే చెప్పకపోతే.. ఇరాన్ దేశంలోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జీలు కూల్చేస్తామని.. సర్వనాశనం చేస్తామని.. ఇరాన్ దేశాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఈ డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తున్న క్రమంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ.. ఆసక్తి.. టెన్షన్ నెలకొంది.