గ్రాండ్‍గా ఇండియన్ రేసింగ్ లీగ్ ఈవెంట్స్

 గ్రాండ్‍గా ఇండియన్ రేసింగ్ లీగ్ ఈవెంట్స్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో.. ఇండియన్ రేసింగ్ లీగ్ ఈవెంట్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇవాళ అసలైన పోటీలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోటీలు మొదలయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు పోల్ పొజిషన్ రేసు ఉంటుంది. మధ్యాహ్నం 2గంటలకు 25నిమిషాల పాటు స్ప్రింట్ 2 రేసు ఉంటుంది. మధ్యాహ్నం మూడున్నరకు స్ప్రింట్ 3 రేస్ 45 నిమిషాల పాటు జరగనుంది. అయితే ఇయ్యాళ ఆదివారం కావటంతో రేసింగ్ చూసేందుకు సిటీ జనం ఆసక్తి చూపుతున్నారు. 

ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు టాయ్ంక్ బండ్ వద్ద మొదలుకాగా.. ప్రత్యేకం రూపొందించిన ట్రాక్ పై రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే మొదటిరోజు ప్రేక్షకుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ప్రచారం చేయకపోవడం, టికెట్ల ధరలు భారీగా ఉండడంతో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఒకరోజు కోసం టికెట్ ప్రారంభ ధర రూ.749, రెండ్రోజుల పాటు చూసేందుకు రూ.1,249గా ఉన్నాయి. అయితే టికెట్లను బుర్ మై షో యాప్ లో పెట్టినట్టు తెలియకపోవడంతో 7వేల మంది కోసం సీట్లు ఏర్పాట్లు చేయగా.. వెయ్యిలోపే జనం వచ్చారు.