మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో ముఖాముఖి.కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సోమవారం ( జూన్ 22 ) జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. అర్హత కలిగిన జర్నలిస్టుల అందరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడేషన్ కార్డులు అందిస్తామని అన్నారు.
అర్హత ఉన్న జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు,ఇండ్ల స్థలాలు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మందమర్రిలో ఏర్పాటు చేశామని అన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు కరవు లేదని అన్నారు.
నిరుద్యోగ యువత జర్మనీ భాష నేర్చుకుంటే ఉపాధి కల్పించే బాధ్యత తనదని అన్నారు మంత్రి వివేక్. తెల్లరేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులందరికీ సబ్సిడీ రుణాలను అందిస్తానని హామీ ఇచ్చారు మంత్రి వివేక్.
