Skin Care: చాలా మంది నిద్రపోయే ముందు, అలాగే నిద్ర లేచాక సబ్బుతో ముఖం కడుక్కుంటూ ఉంటారు. కానీ ముఖంపై ఉన్న ఆయిల్ క్లీన్ అయి పింపుల్స్ రాకుండా ఉంటుందని ఇలా చేస్తుంటారు. ఇలా చేయడం అన్ని రకాల స్కిన్ టైప్స్‌కు మంచిది కాదని స్కిన్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
అందరి స్కిన్ ఒకేలా ఉండదు:
అందరి చర్మం ఒకేలా ఉండదు. కొందరికి ఆయిలీ స్కిన్ (Oily skin) ఉంటే, ఇంకొందరికి డ్రై స్కిన్ (Dry skin) ఉంటుంది. అందుకే ఒకరికి సెట్ అయిన టిప్స్, మరొకరికి వర్కవుట్ అవ్వకపోవచ్చని స్కిన్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు.
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు ఏం చేయాలంటే:
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు ప్రతి రోజూ రెండు పూటలా ముఖం కడుక్కోవడం మంచిది.. ఎందుకంటే, నిద్రపోయేటప్పుడు ముఖంపై ఆయిల్ బాగా పేరుకుపోతుంది. దాన్ని నిద్రలేచాక క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా స్కిన్‌పై ఉండిపోయి, స్కిన్ ప్రాబ్లమ్స్ మరింత ఎక్కువయ్యే అవకాశం చాలా ఉంటుంది.
డ్రై స్కిన్ వాళ్లు ఫేస్‌వాష్ చేయొద్దు:
అదే డ్రై స్కిన్ వాళ్లకు ముఖంపై ఆయిల్ పేరుకుపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల వారి చర్మంపై బ్యాక్టీరియా పేరుకుపోవడం కూడా తక్కువే.. ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నవాళ్లు అతిగా లేదా ఎక్కువ సార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే చర్మం మరింత పలుచబడుతుంది. దీంతో, చర్మంలో ఉన్న కాస్త ఆయిల్ కూడా పోయి, ముఖంపై తొందరగా ముడతలు పడే ఛాన్స్ ఉంటుంది.
స్కిన్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే:
ఫేస్‌వాష్ వాడే ముందు బ్లైండ్‌గా అందరినీ ఫాలో అవ్వకుండా.. మొదట మీ స్కిన్ టైప్ ఏంటో క్లియర్ గా తెలుసుకోవాలి.. దానికి తగినట్లుగా మాత్రమే మీరు మీ చర్మాన్ని క్లీన్ చేసుకోవాలని స్కిన్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
