భద్రాచలం, వెలుగు: భద్రాచలం స్నానఘట్టాల వద్ద ఆదివారం రాత్రి గోదావరికి నదీహారతి ఇచ్చారు. గణపతి పూజ, జై శ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం నిర్వహించి గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. భద్రాద్రి రామయ్యకు 12 సార్లు హారతి ఇచ్చి , ఆ తర్వాత గోదావరికి నదీహారతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

