భద్రాచలం స్నానఘట్టాల వద్ద గోదావరికి నదీ హారతి వైభవంగా నిర్వహించారు. ఏకాదశి ఆదివారం నిర్వహించిన ఈ నదీహారతి విశేషమైనదని పురోహితులు రామావజ్జుల రవికుమార్ తెలిపారు.
గణపతి పూజ, దీపోత్సవం తర్వాత ముందుగా రాముడికి, తర్వాత గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కల్యాణార్థం నదీ హారతిని నిర్వహించారు. శాంతి మంత్రం పఠించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -భద్రాచలం, వెలుగు
