
బ్యూనస్ ఎయిర్స్: 36 ఏండ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ గెలిచి సొంత దేశానికి తిరిగొచ్చిన అర్జెంటీనా టీమ్‌కు గ్రాండ్ వెల్‌కం లభించింది. మంగళవారం తెల్లవారుజామున ఎజీజా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ప్లేయర్లు రెడ్ కార్పెట్ మీద ముందుకు వెళ్లారు. ఫ్యాన్స్‘లా మోస్కా టెట్సె’ బ్యాండ్‌ను మోగిస్తూ, ‘ముచాచోస్’ సాంగ్స్ పాడుతూ, పటాకులు కాల్చుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. గెలుపు సంబురాలతో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ మొత్తం పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయింది. గవర్నమెంట్ సెలవు ప్రకటించింది. మెడలో గోల్డ్ మెడల్స్ వేసుకున్న ప్లేయర్లు ఓపెన్ టాప్ బస్‌లో కప్‌ను చూపిస్తూ.. ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
గతంలో మారడోనా బృందం చేసినట్లుగా.. అర్జెంటీనా ప్రెసిడెంట్ ఆఫీస్ కాసా రోసాడో బాల్కనీలోకి వచ్చి ఫొటోలు దిగాలని గవర్నమెంట్సలహా ఇచ్చినా.. దీనికి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఎఫ్ఏ) అంగీకరించలేదు. మార్నింగ్ వరకే భారీ ఒబెలిస్కో స్మారక చిహ్నం వద్ద లక్ష మందికి పైగా ఫ్యాన్స్ చేరడంతో నేరుగా అక్కడికే వెళ్లారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న ఎఎఫ్ఏ వద్ద ప్లేయర్లు కాసేపు గడిపారు. మరోవైపు మెస్సీ తన కలల కప్పును విడిచిపెట్టడం లేదు. ఎఎఫ్ఏ కాంప్లెక్స్‌లోని తన గదిలో కప్‌ను పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నట్లు మెస్సీ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.