రోడ్డు మధ్యలో దిగబడిన గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ

రోడ్డు మధ్యలో దిగబడిన గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ

బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు మధ్యలో గ్రానైట్ లారీ దిగబడటంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలోని బూరుగుపల్లి నుంచి బావుపేటకు గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండరాళ్లతో లారీలు వెళ్తుంటాయి.

ప్రస్తుతం వెంకట్రావుపల్లి వద్ద ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా బ్రిడ్జి వద్ద లారీ దిగబడింది. పోలీసులు బుధవారం ఉదయాన్నే ప్రొక్లయిన్ల సాయంతో లారీని తొలగించారు.

Also Read : సర్కారు దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెంచాలి : భాస్కర్ నాయక్