సర్కారు దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెంచాలి : భాస్కర్ నాయక్

సర్కారు దవాఖానాల్లో డెలివరీల సంఖ్య పెంచాలి :  భాస్కర్ నాయక్

జూలూరుపాడు/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సర్కారు దవాఖానాల్లో డెలవరీల సంఖ్య పెంచాలని డీఎంహెచ్ వో  భాస్కర్ నాయక్ డాక్టర్లకు సూచించారు. బుధవారం జూలూరుపాడు, ఎర్రగుంట  పీహెచ్​సీలను ఆయన సందర్శించారు.

ఆసుపత్రి రికార్డులు పరిశీలించారు. శానిటేషన్ పై దృష్టి సారించాలన్నారు.  వర్షా కాలంలో విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన  జాగ్రత్తలను వివరించారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఆయన వెంట డీఐవో బాలాజీ నాయక్, డాక్టర్లు ఉన్నారు.

Also Read : మహబూబ్​నగర్‌‌లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం