
పద్మారావునగర్, వెలుగు: ఫిల్మ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఫ్ టీపీసీఐ) ప్రతి ఏటా ఫిల్మ్, టెలివిజన్ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్డులను అందజేస్తోంది. అలాగే గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవాన్ని ఈ నెల 19న బేగంపేట కంట్రీ క్లబ్‌లో నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం (సెప్టెంబర్ 03) హైడ్రా ఆఫీస్లో కమిషనర్ రంగనాథ్ చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎఫ్ టీ పీసీఐ తెలంగాణ మీడియా చైర్మన్ కిరణ్ బెజాడీ, మీడియా డైరెక్టర్ మున్నూరు చందు, సభ్యులు స్మిత, దీపిక, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు.