వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ జనాలకు వణికిస్తున్న దోమల దాడులకు చెక్ పెట్టనున్నట్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు తెలిపారు. సిబ్బందిని ఇప్పటికే రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. బుధవారం ‘వీ6 వెలుగు'లో 'ఓరుగల్లులో దోమల రాజ్యం' కథనంతో వార్తను ప్రచురితమైంది. దీంతో బల్దియా అధికారులు స్పందించారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఒక్కో డివిజన్‍కు 5 లీటర్ల చొప్పున డబుల్ స్ట్రెంథ్ ఎంఎల్‍ఓ చొప్పున అర్బన్ మలేరియా సెక్షన్ సిబ్బందికి అందించింది. ప్రతి డివిజన్లో మూన్నాలుగు రోజుల వ్యవధి గడువు ఇస్తూ మూడుసార్లు దోమలు సంచరించే ప్రదేశాల్లో స్ర్పే చేసేలా ఆదేశాలిచ్చారు. సిబ్బంది కాలనీల్లో స్పెషల్ మాసివ్ డ్రైవ్ నిర్వహించారు.

