V6 News

వాటర్ బోర్డులో డిప్యుటేషన్లకు గ్రీన్ సిగ్నల్

వాటర్ బోర్డులో డిప్యుటేషన్లకు గ్రీన్ సిగ్నల్
  • ఆసక్తి ఉన్నవారిని పంపించాలని ఇతర శాఖలకు బోర్డు లెటర్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్ బోర్డు పరిధి విస్తరణ నేపథ్యంలో ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల అవసరం పెరిగింది. దీంతో ప్రభుత్వం ఇప్పటికే బోర్డులో ఖాళీగా ఉన్న 100 మేనేజర్ పోస్టులు, కొత్తగా మరో130 మేనేజర్ పోస్టులు కలిపి 230 ఖాళీల భర్తీకి అనుమతించింది. అత్యవసరంగా అవసరం ఉన్న వారిని తాత్కాలికంగా ఇతర డిపార్ట్​మెంట్ల నుంచి డిప్యూటేషన్​పై తీసుకోవడానికి పర్మిషన్​ఇచ్చింది.

దీంతో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ తదితర విభాగాల నుంచి అసిస్టెంట్ ఇంజినీర్లు,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను డిప్యూటేషన్ పద్ధతిలో నియమించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే సంబంధిత శాఖల ఈఎన్​సీలకు లెటర్లు పంపి ఆసక్తి కలిగిన అధికారులను బోర్డుకు పంపించాలని కోరింది.