హైదరాబాద్, వెలుగు: పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్ ఫెడ్ ద్వారా పంట సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పొద్దుతిరుగుడు ఎక్కువగా సాగుచేసిన సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో రైతులకు ఊరట లభించినట్లయింది. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల ఎకరాల్లో సన్ ఫ్లవర్ పంట సాగైంది. ఎకరానికి 8.39 క్వింటాళ్ల చొప్పున పంట దిగుబడి అంచనాలతో 15 వేల టన్నుల పంట మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, 25 శాతం కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకు అనుమతించింది.
దీంతో సెంట్రల్ పూల్‌లో 6,500 టన్నులు కొనుగోలు చేయగా, మిగిలిన పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సర్కారు స్పందించింది. తాజాగా గురువారం మరో 5,800 టన్నుల పంటను కొనేందుకు అనుమతించింది. ఇందుకు రూ.41 కోట్లు బ్యాంకు గ్యారంటీని మార్క్‌ఫెడ్‌కు ఇచ్చి కొనుగోలు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. .
