హిందాల్కోతో గ్రీన్​కో ఒప్పందం

హిందాల్కోతో గ్రీన్​కో ఒప్పందం

న్యూఢిల్లీ: గ్రీన్​ ఎనర్జీ సప్లయ్​ చేసేందుకు హిందాల్కోతో గ్రీన్​కో ఒప్పందం కుదుర్చుకుంది. హిందాల్కో ప్లాంట్‌లో  400 మెగావాట్ల గ్రీన్​ ఎనర్జీ ప్లాంట్​ను ఈ ఒప్పందం కింద గ్రీన్​కో ఏర్పాటు చేస్తుంది. విండ్​, సోలార్​ రెండూ ఉండే ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్​ను హిందాల్కో అల్యూమినియం స్మెల్టర్​కు సప్లయ్​ చేస్తామని గ్రీన్​కో వెల్లడించింది. ఈ సోలార్, విండ్​ ప్రాజెక్టు డిజైన్​, నిర్మాణంతోపాటు కొంత మేర నిర్వహణ బాధ్యతలను కూడా తాము చేపట్టనున్నట్లు గ్రీన్​కో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​లోని తమ హైడ్రో పంప్​ స్టోరేజ్​ ప్రాజెక్టులోనే ఈ కొత్త ప్రాజెక్టు కోసం  తగిన స్టోరేజ్​ కెపాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 25 ఏళ్లపాటు హిందాల్కోకు ఈ ఒప్పందం కింద విద్యుత్​ను సప్లయ్​ చేస్తామని గ్రీన్​కో పేర్కొంది. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్షియల్​ డిటెయిల్స్​ను మాత్రం గ్రీన్​కో వెల్లడించలేదు. ఆదిత్య బిర్లా గ్రూప్​లోని హిందాల్కో ఇండస్ట్రీస్​ ప్రపంచంలోనే రెవెన్యూ పరంగా పెద్ద అల్యూమినియం కంపెనీ.