
ముషీరాబాద్, వెలుగు: మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి, పోస్టింగ్స్ జాబితా ప్రకటించాలని గ్రూప్-2కు ఎంపికైన అభ్యర్థులు డిమాండ్చేశారు. ఇదే విషయమై శుక్రవారం గాంధీభవన్లో వినతి పత్రాలు సమర్పించారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చి, 2024లో పరీక్ష, 2025 మార్చిలో ఫలితాలు ప్రకటించినప్పటికీ తమకు ఇంకా పోస్టులు ఇవ్వలేదన్నారు. పంచాయతీ, స్థానిక ఎన్నికల కోడ్ వస్తే ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా ప్రక్రియ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని కోరారు. అభ్యర్థులు రాజశేఖర్ రెడ్డి, రాజ్ కుమార్, మదన్, వినయ్, రాజశేఖర్ ఉన్నారు.