వీల్ చైర్లు, దుప్పట్లు, చేతి కర్రల పంపిణీ

వీల్ చైర్లు, దుప్పట్లు, చేతి కర్రల పంపిణీ

మెహిదీపట్నం, వెలుగు: ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ పిలుపునిచ్చారు. న్యూ ఇయర్​ని పురస్కరించుకొని వీరభద్రస్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంబటి క్రాంతి సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం  మెహిదీపట్నంలోని వీరభద్రస్వామి ఆలయం వద్ద దివ్యాంగులకు వీల్ చైర్లు, చేతి కర్రలు, వృద్ధులకు దుప్పట్లు, చేతి కర్రలు, ప్రభుత్వ స్కూల్​ స్టూడెంట్లకు స్కూల్ బ్యాగ్‌లు, స్టేషనరీ, టేబుల్స్ అందజేశారు.

అనాథాశ్రమానికి గీజర్ తదితర వస్తువులను పంపిణీ చేశారు. చీఫ్ ​గెస్టులుగా కార్పొరేటర్లు దేవర కరుణాకర్, బండ్లగూడ మున్సిపల్ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నిరుపేదలకు వీలైనంత సాయం అందించాలని చెప్పారు. ట్రస్ట్ ప్రతినిధులు అరవింద్ యాదవ్, పన్నలాల్, శ్రీనివాస్ చారి, మహేశ్, శ్రీనివాస్ ను అభినందించారు. కార్యక్రమంలో కార్వాన్ యాదవ్ సంఘం అధ్యక్షుడు బోడి అశోక్ యాదవ్, బీజేపీ నేతలు అన్ను యాదవ్, బండారి రాధిక తదితరులు పాల్గొన్నారు.