ఐపీఎల్ చరిత్రలో ఇతనిది చెత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో ఇతనిది చెత్త రికార్డు

ఐపీఎల్ 2023లో భాగంగా ఏప్రిల్ 09న ఆదివారం రోజున   గుజరాత్ టైటాన్స్,  కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మొత్తం నాలుగు ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్ గా యశ్ దయాల్ నిలిచాడు.  

మొదటి మూడు ఓవర్లలో 38 పరుగులు ఇచ్చిన దయాల్ చివరి ఓవర్లో 29 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ తరుపున మొత్తం 3 మ్యాచ్ లు ఆడిన ఒక్కవికెట్ కూడా తీయలేదు. గతేడాది గుజరాత్ తరుపున మొత్తం 9 మ్యాచ్ లు ఆడిన దయాల్ 11 వికెట్లు పడగొట్టాడు.  

అతని కంటే ముందుగా బాసిల్ థంపి(70) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 2018లో హైదరాబాద్ తరుపున ఆడిన ఈతను బెంగుళూరుపై  నాలుగు ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. వీరి తరువాత లిస్టులో ఇషాంత్ శర్మ(66), ముజీబ్ రెహ్మాన్ (66), ఉమేశ్ యాదవ్ (65) ఉన్నారు.