
విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక గుజరాత్ సీఎం స్టేజీ దిగిపోయారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విలేకర్లు ఆయనను చుట్టిముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అంతలో ఓ విలేకరి.. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజ్‌కోట్‌లోని ఆస్పత్రిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 1235 మంది పిల్లలు మరణించారు.. దీనిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక.. సీఎం మౌనంగా స్టేజీ దిగి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ వీడియోని హర్యానా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఒక్క రాజ్‌కోట్‌లోనే కాకుండా.. అమిత్ షా ఎంపీగా ఎన్నికైన గాంధీనగర్‌లోని సివిల్ ఆస్పత్రిలో కూడా గత 3 నెలల్లో 375 మంది పిల్లలు మరణించారని ఆయన తన పోస్టులో పేర్కొన్నాడు.
ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్లిపోయిన సీఎం విజయ్ రూపానీని సీఎం పదవి నుంచి ప్రధాన మంత్రి తొలగిస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
Sh. Vijay Rupani, CM,Guj. is MLA from Rajkot.
Jan-Dec, 1,235 children have died in Rajkot hospital.
Sh. Amit Shah is MP from Gandhinagar+Ahmedabad. 375 children have died in last 3 months in Civil Hospital.
When questioned, CM runs away!
Will PM dare to dismiss Vijay Rupani? pic.twitter.com/uyBYHJYVX4
— Randeep Singh Surjewala (@rssurjewala) January 5, 2020