
కరోనా కేసులు దేశమంతా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా కూడా కరోనా బారినపడ్డారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు అంతగా లేకపోవడంతో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరాలా వద్దా అనే విషయం ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయించబడతుంది.
వాఘేలా 1996 లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారు. ఆయన గత మూడు, నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ‘బాపు’ అని పిలవబడే వాఘేలా సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతో పాటు శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వాఘేలా స్థానంలో జయంత్ పటేల్ ను నియమించడంతో.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌సిపి శాసనసభ్యుడు కంధల్ జడేజా రాజ్యసభ ఎన్నికలలో విప్‌ను ఉల్లంఘించి మరీ బీజేపీకి ఓటు వేయడంపై వాఘేలా అసంతృప్తి వ్యక్తం చేశారు. వాఘేలా ‘ప్రజాశక్తి మోర్చో’అనే స్వంత పార్టీని స్థాపించాడు. అంతేకాకుండా ఆయన గత రెండు రోజులుగా దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్నాడు.
For More News..