
అహ్మదాబాద్: క్యాడిలా ఫార్మాకు చెందిన ముగ్గురు ఉద్యోగులు వైరస్ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారని గుజరాత్‌లోని క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ ప్లాంట్ అధికారులు శనివారం ప్రకటించారు. మృతులు కంపెనీ ప్రొడక్షన్, ప్యాకేజింగ్ డిపార్ట్ మెంట్లో పనిచేసేవారని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన గుజరాత్ అహ్మదాబాద్ లోని క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో ఈనెల మొదట్లో 26 మందికి కరోనా సోకింది. దీంతో కంపెనీని మూసివేసి వారితో కాంటాక్టు అయిన ఉద్యోగులను క్వారంటైన్ కి తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా కేసులు ఎక్కవగా నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 9,724 మంది వైరస్ బారిన పడగా.. 645 మంది మరణించారు.