IPL 2023 : గుజరాత్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. విలియమ్సన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్

IPL 2023 : గుజరాత్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. విలియమ్సన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్

గుజరాత్ టైటాన్స్.. కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక కెప్టెన్ దషున్ శనక ను టీంలోకి తీసుకుంది. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్ లో విలియమ్సన్ మోకాలికి గాయమైంది. బౌండరీ ఆపబోయి కింద పడటంతో అతన్ని హాస్పిటల్ కి తరలించారు.

అతని కాలును స్కాన్ చేసిన డాక్టర్లు కొంత కాలం రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో  ఐపీఎల్ మొత్తానికి కేన్ విలియమ్సన్ దూరమైయ్యాడు. ఆల్ రౌండర్ శనక రాకతో గుజరాత్ జట్టు మరింత పటిష్టంగా తయారయింది. 

శనక పేస్ బౌలింగ్ తో పాటు మంచి పవర్ హిట్టర్ కూడా. దీంతో రూ.50లక్షల బేస్ ప్రైస్ తో గుజరాత్ శనకను దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో శనకను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. శనకకు టీ20ల్లో 62 సగటుతో 187 స్ట్రేక్ రేట్ ఉంది.