V6 News

కాలుష్య కోరల్లో గుండ్ల నీళ్ల చెరువు.. మురుగు నీరు చేరి చేపలు మృతి

కాలుష్య కోరల్లో గుండ్ల నీళ్ల చెరువు.. మురుగు నీరు చేరి చేపలు మృతి

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలోని ‘గుండ్ల నీళ్ల చెరువు’ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిసర ప్రాంతాల్లోని విల్లాస్ నుంచి వెలువడే డ్రైనేజీ నీటిని ఎటువంటి సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) లేకుండానే నేరుగా చెరువులోకి వదలడంతో నీటి నాణ్యత పూర్తిగా క్షీణించింది. 

కలుషిత నీటిలోని రసాయనాలు, విషపూరిత పదార్థాల వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి, చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల లక్షల్లో నష్టం వాటిల్లుతోందని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నీరు నల్లగా మారి దుర్వాసన వెదజల్లుతోందని, కాలుష్య నియంత్రణ శాఖ, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మురుగు నీరు చెరువులోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.