
అనంతపురం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు గుంతకల్లు రైల్వే కోర్టు 7 రోజుల రిమాండ్ ను విధించింది. 2008లో వేరుశనగ విత్తనకాయలు కోసం అనంతపురం లో రైల్ రోకో చేపట్టిన రామకృష్ణపై గుంతకల్లు రైల్వే పీఎస్ లో కేసు నమోదైంది. అయితే ఈ కేసుపై వాయిదాలకు హాజరుకాకపోవడంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.