'గుంటూరు కారం' థమన్ క్లారిటీ?

'గుంటూరు కారం' థమన్ క్లారిటీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్ఎస్ థమన్..అలా వైకుంఠపురం సినిమా పాటలతో అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ త్రివిక్రమ్,థమన్ కాంబో అభిమానులకి ఫుల్ కేజ్రీ ఉంది.గతంలో వచ్చిన అరవింద సమెత వీర రాఘవ మూవీలోని పాటలు అభిమానులని కట్టి పడేశాయి..ప్రస్తుతం ఈ కాంబో లో రాబోతున్న మరో మూవీ గుంటూరు కారం.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ మూవీ నుండి రిలీజ్ అయినా మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ వీడియోని రీలిజ్ చేశారు.థమన్ ఇచ్చిన ట్రాక్  బీజీఎం కి మిశ్రమ స్పందన రావటంతో టీమ్ అసంతృప్తి ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. 

థమన్  స్థానంలో కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.ఈ మూవీ నుండి స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ని తొలిగించి మరో హీరోయిన్ ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలపై ఇప్పటి వరికి ఎటువంటి అధికారిక ప్రకటన మేకర్స్ ప్రకటించలేదు. 

సోషల్ మీడియా లో తన పై వస్తున్న వార్తల థమన్ కౌంటర్ ఇచ్చారు: 

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ పెట్టారు.అందులో 'నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్ ను ప్రారంభిస్తున్నాను.కడుపు మంట లక్షణాలు ఉన్నవారందరికీ ఫ్రీగా అందిస్తాను.చల్లగా తాగి కోలుకొని వెళ్ళండి..పెద్దగా ఆలోచించకండి..చాలా పని ఉంది..నా టైంను వృథా చేయకండి ' అంటూ బదులిచ్చాడు.

గుంటూరు కారం సినిమాకి తను కంటిన్యూ అవుతున్నాడనేది మాత్రం క్లారిటీ  ఇవ్వలేదు.

https://twitter.com/MusicThaman/status/1670846867650002946