నువ్వు అద్భుతం బాసూ.. క్యాబ్ పైనే కుర్చుని ఎంత కూల్ గా వర్క్ చేస్తున్నావ్.. !

 నువ్వు అద్భుతం బాసూ.. క్యాబ్ పైనే కుర్చుని ఎంత కూల్ గా వర్క్ చేస్తున్నావ్.. !

సిటీ ఏదైనా సరే.. ఉదయం ఆఫీసుకు వెళ్లటం పెద్ద టాస్క్.. ట్రాఫిక్ అనేది టెన్షన్ పుట్టిస్తది.. ఇది రెగ్యులర్ రోజుల్లో.. ఇక వర్షం పడే రోజుల్లో అయితే ట్రాఫిక్ తోపాటు రోడ్లపై నిలిచి నీళ్లతో మరింత హైరానా.. ఇదే సమయంలో మన బండి లేదా కారు బ్రేక్ డౌన్ అయితే.. ఇక చూడండీ.. కోపం తన్నుకొస్తది.. అలా ఇలా కాదు.. నోటి నుంచి బూతులే వస్తాయి.. ఇది మామూలు సిట్యువేషన్.. సరిగ్గా ఇలాంటి సిట్యువేషన్ లోనే.. క్యాబ్ లో ఆఫీసుకు వెళుతున్న ఓ యంగ్ ఐటీ ఉద్యోగికి ఎదురైంది.. అతను ఏం చేశాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ ఏరియాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి నుంచి ఆఫీసుకు క్యాబ్ లో బయలుదేరాడు. ఫుల్ వర్షం. రోడ్లపై భారీగానే నీళ్లు. ఇదే సమయంలో తన క్యాబ్ చెడిపోయింది. కారు కదిలే పరిస్థితి లేదు. సీన్ మొత్తం అర్థం అయిపోయింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లటం కష్టం అని భావించిన ఆ ఉద్యోగి.. వాట్ నెక్ట్స్ అని గట్టిగా ఆలోచించాడు. 

ఆఫీసుకు ఫోన్ చేసి వర్క్ ఫ్రమ్ హోం అడిగాడు. మేనేజర్ ఓకే అన్నాడు. కారు నుంచి బయటకు రావాలంటే చుట్టూ నీళ్లు. సో.. ఇంకా వర్షం పడినా.. నీళ్లు పెరిగినా కారులోకి నీళ్లు వస్తాయి. సో.. వెంటనే క్యాబ్ పైకి వెళ్లాడు. కారు రూఫ్ పై కూర్చున్నాడు. ల్యాప్ టాప్ ఓపెన్ చేశాడు. వర్క్ స్టార్ట్ చేశాడు. పక్కన ఓ వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు. మధ్యలో వర్షం వస్తే మళ్లీ లోపలికి వెళతాడు.. ఈ క్లారిటీతో వర్క్ స్టార్ చేయటం మొదలుపెట్టాడు. 

ఈ ఇన్సిడెంట్ ను ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాబ్ పైన ఎక్కటం ఎందుకు.. క్యాబ్ లోపల కూర్చుని వర్క్ చేసుకోవచ్చు కదా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే వర్క్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ బాసూ.. నువ్వు అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు అయితే ఐటీ ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుంది.. వర్క్ టెన్షన్ ఎలా ఉంటుంది అనటానికి ఇదే నిదర్శనం అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే రీల్స్ .. రీల్స్ పిచ్చి అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఏదిఏమైనా.. కూల్ గా వర్క్ చేస్తున్నాడు చూడు.. ఆవేశం లేకుండా.. చుట్టూ వాళ్లను పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటున్నాడు చూడు నువ్వు కేక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. ఈ వీడియో మాత్రం వైరల్ అయ్యింది..