
- కేసీఆర్ కోటరీ వల్లే ఈ దుస్థితి
- నాయకత్వంపై విశ్వాసం లేకనే నేతలు పోతున్నరు
- నాకు ఏ పార్టీతో సంబంధం లేదు
హైదరాబాద్: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. నాయకత్వంపై విశ్వాసం లేకనే నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. గులాబీ పార్టీలో అంతర్గత సమస్యల వల్ల తన కుమారుడు పోటీకి దూరంగా ఉన్నారని తెలిపారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నారు. ఒకనాడు జేబులో రూ.500 కూడా లేని వ్యక్తులు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అన్నారు.