అమెరికన్లకు, అక్కడ చదివిన విదేశీయులకే ప్రాధాన్యం

అమెరికన్లకు, అక్కడ చదివిన విదేశీయులకే ప్రాధాన్యం
  • హెచ్ 1బీ, ఎల్ 1 వీసా జారీ లో మార్పులు !

వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ తో అమెరికాలో అన్ ఎంప్లాయి మెంట్ పెరిగి పోవటంతో పరిస్థితిని సెట్ రైట్ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఉద్యోగాల్లో అమెరికన్లు, లేదా అక్కడ చదివిని విదేశీయులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విధంగా హెచ్ 1 బీ, ఎల్ 1 వీసా నిబంధనల్లో మార్పు చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదిత బిల్లును అమెరికా కాంగ్రెస్ లో పెట్టారు. దీనికి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు మద్దతు తెలుపుతున్నారు. ది హెచ్ 1బీ అండ్ ఎల్ 1 వీసా రిఫార్మ్ యాక్ట్ పేరిట రూపొందించిన బిల్లులో కీలక సంస్కరణలు సూచించారు. హెచ్ 1 బీ వీసాలో విషయంలో ముందుగా అమెరికాలో చదివి స్కిల్స్ ఉన్న విదేశీ విద్యార్థులకే హెచ్ 1 బీ వీసాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్ 1 బీ, ఎల్ 1 వీసా లతో ఇతర దేశీయులు వచ్చే విధానాన్ని నిషేధించాలని బిల్లులో కోరారు. టెంపరరీ పద్దతిలో చాలా కంపెనీలు హెచ్ 1 బీ వీసాల ద్వారా విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. అలా హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాల ద్వారా వచ్చే వారిని వారి దేశాలకు తిరిగి పంపించాలని కోరాయి. అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహారించకుండా కచ్చితంగా చట్టాన్ని ఫాలో అయ్యే విధంగా బిల్లులో సూచనలు చేశారు. ఇందుకోసం లేబర్ డిపార్ట్ మెంట్ కు పూర్తి అధికారాలు ఇచ్చారు. చాలా కంపెనీలు తక్కువ జీతం ఇస్తూ విదేశాల నుంచి హెచ్ 1 బీ, ఎల్ 1 వీసా ల ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటున్నాయి. ఇది అమెరికన్ల ఉద్యోగాలపై ఎఫెక్ట్ చూపుతుంది. కచ్చితమైన వేతన నిబంధన అమలు చేస్తే విదేశీ ఉద్యోగులను కంపెనీలు తెచ్చుకోవన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేశారు. బిల్లు ఆమోదం పొందితే హెచ్ 1 బీ వీసా హాల్డర్లకు ఇబ్బందులు తప్పవు.