నా భర్తకు గతంలో పెళ్లయిందని ముందే తెలుసు: హన్సిక

నా భర్తకు గతంలో పెళ్లయిందని ముందే తెలుసు: హన్సిక

హన్సిక.. దేశ ముదురు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ గతేడాది డిసెంబర్ 4న  పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..  తన ప్రియుడు సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగు పెట్టింది.  అయితే హన్సిక భర్త సోహెల్ కు ఇంతకుముందే రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వేడుకలో హన్సిక ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దీంతో చాలా మంది సోహెల్ తన భార్యతో విడిపోవడానికి కారణం హన్సికనే  అని  ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై లేటెస్ట్ గా హన్సిక స్పందించింది. తన భర్త మొదటి వివాహం గురించి చెప్పింది.

లవ్ షాదీ డ్రామా పేరుతో హన్సిక వెడ్డింగ్ వీడియో డిస్నీ హాట్ స్టార్  లో శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన భర్త సోహెల్  గురించి జరుగుతోన్న ప్రచారం తనను ఆందోళనకు గురిచేసిందని హన్సిక వెల్లడించింది.   అయితే తన తల్లి సూచనలతో తన పెళ్లి ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేశానని  చెప్పింది. తన భర్త సోహెల్ కు  గతంలోనే పెళ్లయిన విషయం  తెలుసని వెల్లడించింది.  అయితే తన భర్త సోహెల్ విడాకులకు కారణం తాను కాదని  హన్సిక  స్పష్టం చేసింది.