
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సూపర్ హీరో మూవీ ‘హను–మాన్’. అమృత అయ్యర్ హీరోయిన్. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మారాఠీ భాషల్లో మే 12న వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో శరవేగంగా షూటింగ్ జరిపిన టీమ్.. సోమవారంతో షూట్ మొత్తం పూర్తయ్యిందంటూ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌కి 130 రోజులు పట్టిందని, దేశంలోని పలు లొకేషన్స్‌లో తీశామన్నారు దర్శక నిర్మాతలు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. తేజ సజ్జ హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేది మూవీ మెయిన్ కాన్సెప్ట్. వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.