హనుమకొండలో ప్రీ బుకింగ్ పేరిట మోసం

హనుమకొండలో ప్రీ బుకింగ్ పేరిట మోసం

హనుమకొండ సిటీ, వెలుగు: ఫ్లాట్ ప్రీ బుకింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన వ్యక్తిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శివకుమార్ వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో బాలాజీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయాన్ని సోలిపేట ప్రభాకర్ రెడ్డి, కోడూరు లక్ష్మి 2018లో పార్ట్​నర్​షిప్​లో ప్రారంభించారు. ‘ఎస్‌‌‌‌‌‌‌‌వీబీ వైభవర్’ ప్రాజెక్టు పేరుతో ఫ్లాట్లు నిర్మిస్తున్నామని ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు ఇస్తామని ప్రచారం చేశారు.

ఈ క్రమంలో హనుమకొండ ఏనుగులగడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ నుంచి రెండు ఫ్లాట్ల ప్రీ బుకింగ్ పేరుతో రూ.81 లక్షలు వసూలు చేశారు. పనులు ప్రారంభించకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితురాలు హనుమకొండ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సోలిపేట ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.