వైభవంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

వైభవంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు

జగిత్యాల జిల్లా: మాల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కొండగట్టుకు భక్తులు భారీగా పోటెత్తారు. పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హనుమాన్‌ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున‌ తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్‌.. జై హనుమాన్ నినాదాలు, నామస్మరణతో మారుమోగుతున్నాయి. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వాములు మాల విరమణ చేస్తున్నారు. అయితే కొండగట్టు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అంటున్నారు. బస్సుల దగ్గర నుంచి పుష్కరిణిలో స్నానాల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు భక్తులు. ప్రభుత్వం కొండగట్టును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.